బొల్లంపల్లిలో అధికారులకు ఘన సన్మానం

కల్వకుర్తి అక్టోబర్ 28: వెల్దండ మండల ఎంపీఓ లింగయ్య, నూతన పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్‌లను బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు తొలిసారిగా హాజరైన అధికారులను వార్డు సభ్యులు సత్కరించారు. గతంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణను ఆదర్శ యువజన సంఘం సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు వడ్త్యావత్ దన్సింగ్ నాయక్, కొమ్ము వెంకటయ్య, పోలే అంజయ్య,…