Daily Archive: October 25, 2026

ఆమనగల్లు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం,వాహనాల రాకపోకల నియంత్రణ,ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరిచేందుకు,ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లపై సర్పంచుల వాగ్వివాదం.. జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే

వెల్దండ అక్టోబర్ 24: వెల్దండ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ప్రత్యేక అధికారి విజయశ్రీ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది.గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు కేటాయించారంటూ బీఆర్ఎస్ సర్పంచులు ఆరోపించగా, కాంగ్రెస్ సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.దీంతో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.చెరుకూరులో వివాదాస్పదంగా మారిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులను రద్దు చేయాలని, అజిలాపూర్‌లో లబ్ధిదారుల జాబితాను పరిశీలించి అర్హులకు ఇళ్లు అందేలా…

కామారెడ్డి జిల్లా చరిత్రలో తొలిసారిగా 435 యూనిట్ల రక్తసేకరణ

తలసేమియా చిన్నారుల ప్రాణరక్షణకు పోలీసు శాఖ బృహత్‌ కార్యక్రమంకామారెడ్డి: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 435 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జిల్లాలోనే తొలిసారిగా నమోదైందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహం అధ్యక్షుడు ఎండీ జమీల్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు తలసేమియా సికిల్ సెల్ పురస్కారాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు….

ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేల విరాళం

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణం కోసం తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ రూ.50,000 (యాభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా యువజన అధ్యక్షుడు దేగావత్ జైల్ సింగ్, జిల్లా కాయితీలాభాన్ అధ్యక్షుడు నానక్ సింగ్, పాండు, ఐలాపూర్ ఉపాధ్యక్షుడు సాయిలు, చెన్నం ఉషయ్య, చెన్నం స్వామి, నరేష్, రవి,…

బీర్కూర్ సొసైటీ చైర్మన్‌గా గొండ్ల శ్రీనివాస్

బీర్కూర్ సహకార సంఘం చైర్మన్‌గా బరంగేడ్గి గ్రామానికి చెందిన గొండ్ల శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ పదవి కోసం అంబలి బసవరాజ్, గొండ్ల శ్రీనివాస్ పోటీపడగా, చివరకు శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. త్వరలో సొసైటీ పాలకమండలి డైరెక్టర్లను ఎంపిక చేయనున్నారు.

హైదరాబాద్ అలర్ట్ నీరు, విద్యుత్ 20% తగ్గించుకోవాలని ఎండీ ఆదేశం.

నగరవాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) అత్యంత కీలకమైన సూచనలు చేసింది.

రెండు సూపర్ ఓవర్ల ఉత్కంఠ.. పోలీసులపై ప్రెస్ టీమ్ థ్రిల్లింగ్ విక్టరీ!

బాన్సువాడ ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో తొలి నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఏజాజ్, కాసుల రోహిత్, కౌన్సిలర్ ఎం.ఏ. హకీం కేక్ కట్ చేసి టోర్నీని ప్రారంభించారు.ప్రారంభ మ్యాచ్‌లో ప్రెస్, పోలీస్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. తొలుత పోలీస్ జట్టు 7 ఓవర్లలో 70 పరుగులు చేయగా, ప్రెస్ జట్టు కూడా 70 పరుగులు చేసి మ్యాచ్‌ను టై చేసింది. రెండు సూపర్ ఓవర్ల…