Daily Archive: October 19, 2026
చిన్ముద్ర శబరిమల మహా పాదయాత్ర సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న శబరిమల మహా పాదయాత్రకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితమ్మ మరియు నీరుడు సర్వేష్ ముదిరాజ్ బుధవారం (అక్టోబర్ 14, 2026) ఘనంగా ఆవిష్కరించారు.
బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డుల నుండి 31 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను ఈరోజు ఉదయం 9 గంటలకు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, నాయకులు మహ్మద్ ఏజాజ్, అబ్దుల్ వాహబ్, నార్ల సురేష్,…
బాన్సువాడ పట్టణ మున్సిపాలిటీ చెత్తను మొగులాన్పల్లి తండా, దుంకుడు మోరి తండా, తిరుమలాపూర్, కొయ్యగుట్ట గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో వేస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త నుంచి వెలువడే దుర్వాసన, చెత్తను కాల్చడం వల్ల వస్తున్న దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లాలన్నా, ఇళ్లలో ఉండాలన్నా దుర్వాసన, పొగతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం,…
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 15 : పోలీసు దుస్తుల వెనుక ఒక బాధ్యతగల అధికారి ఉంటారు… కానీ, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసమే పరితపించే మనసున్న ఒక మనిషి ఉన్నప్పుడు, ఆ పోలీసింగ్ ప్రజాదరణ పొందుతుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం కట్టంగూర్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన మునుగోటి రవీందర్ ప్రయాణం అలాంటిదే. ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 65 వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు…
-కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు -చేవెళ్ల ప్రాంతంలో ఉద్యమానికి తీరని లోటని ఆవేదనఎమ్మార్పీఎస్ (MRPS) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, నిబద్ధత కలిగిన ఉద్యమకారుడు బ్యాతల శివశంకర్ మాదిగ ఆకస్మిక మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెపోటుతో ఇటీవల మరణించిన శివశంకర్ మాదిగ నివాసానికి గురువారం ఆయన స్వయంగా వెళ్లారు. రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలంలోని టంగటూరు గ్రామంలోని శివశంకర్ మాదిగ నివాసానికి…
కల్వకుర్తి: కల్వకుర్తి పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మబ్బు రామరాజు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను స్వయంగా నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించారు. వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.అనంతరం రామరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్,…
తలకొండపల్లి: మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారిని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మండల అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీలో నూతన బాధ్యతలు చేపట్టిన మండల అధ్యక్షుడు నీలకంఠ పాండు, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాళ్ల రాజు, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్ ముదిరాజ్‌లను వెంకటేశ్వర్ రెడ్డి శాలువాలతో సన్మానించి మిఠాయిలు తినిపించారు….
కల్వకుర్తి: శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం (అక్టోబర్ 16) నిర్వహించనున్న అమ్మవారి ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ గారు పాల్గొననున్నారు.కార్యక్రమ వివరాలు:- తేదీ: 16-10-2026, శుక్రవారం- సమయం: మధ్యాహ్నం 1 గంటకు- వేదిక: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, కల్వకుర్తి,ఈ సందర్భంగా బీఆర్ఎస్…
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి భూమి పూజవిగ్రహాన్ని సొంత ఖర్చులతో అందిస్తానని ప్రకటించిన డా. తండు సైదులు గౌడ్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 15 : మండలంలోని పామనగుండ్ల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు గురువారం భూమి పూజ నిర్వహించారు. గ్రామ గౌడ కులస్తుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ జెడ్పీటీసీ, చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్ భూమి…
కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు కరువు మండలాలుగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలినకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 15 : 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి.. కనీసం ఆరు గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నారు. అకాల విద్యుత్ కోతలు, లోవోల్టేజీతో రైతుల మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంటూ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై…