Daily Archive: October 5, 2026

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 5: అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన కొండ వెంకన్న, పొడిచేటి సైదులు, గుండు రేణుక, పగిళ్ల పద్మ, పోగుల శ్రీనుకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం నకిరేకల్‌లోని తన క్యాంపు…

తాళం వేసిన ఇంట్లో చోరీ….

తాళం వేసిన ఇంట్లో చోరీ….జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 5 : మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ అయిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూర్ కు చెందిన గీత కార్మికుడు యర్కల పాండు కల్లు గీసేందుకు ఇతర రాష్టం వెళ్లాడు. ఈ నెల 2 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగటగొట్టి బీరువాలో ఉన్న అర తులం బంగారం, 30 తులాల వెంటి పట్టా గొలుసులు…

గురుశిష్యులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం భాషా బోధనలో విశిష్ట సేవలకు గుర్తింపు

గురుశిష్యులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంభాషా బోధనలో విశిష్ట సేవలకు గుర్తింపుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 5: ఏళ్ల క్రితం గురువు బోధించిన విద్యను ఆదర్శంగా తీసుకున్న శిష్యుడు.. నేడు అదే గురువుతో కలిసి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడం విశేషంగా నిలిచింది. కట్టంగూర్‌కు చెందిన సీనియర్ హిందీ పండితుడు వాలుగొండ నరహరి, తెలుగు పండితుడు పొడిచేటి శంకర్‌కు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు…

పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్

కల్వకుర్తి: కల్వకుర్తి మండలం పరిసర ప్రాంతాల్లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, వారి నుంచి రూ.లక్ష నగదు, టాటా ఏస్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎస్సై కురుమూర్తి తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తించినా, పశువుల దొంగతనాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని…

ఈసీని తొలగించాలని సిపిఎం, సిపిఐ పార్టీలు ధర్నాకు పిలుపు

నాగర్‌కర్నూల్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ గుప్తాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6న నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎఫ్‌ఎండీ ఫయాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.పర్వతాలు తెలిపారు.సోమవారం సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఆందోళనకు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి  జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 5: మండలంలోని మునుకుంట్ల గ్రామంలో పెద్ద చెరువు, కోమటికుంట, దబ్బికుంటలకు హద్దులు ఏర్పాటు చేసి కబ్జాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ గుల్లి నరేష్ సోమవారం నల్లగొండలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. చెరువులు, కుంటల పరిధిలోని భూములను కొందరు రైతులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, పారుదల సక్రమంగా…

కొట్ర గ్రామంలో కరెంటు కటకటాలు.. ప్రజావాణిలో సర్పంచ్ ఫిర్యాదు

వెల్దండ అక్టోబర్ 05:వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో నెలకొన్న తక్కువ వోల్టేజ్ విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ శారద చెన్నయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు సోమవారం వెల్దండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో సులోచనకు వినతిపత్రం అందజేశారు.గ్రామంలో సుమారు 100 ఇళ్లకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని వారు తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఫ్యాన్లు, లైట్లు సరిగా పనిచేయక దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే…

గడ్డం వెంకటస్వామి ఆశయాలకు ఘన నివాళి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 5:దివంగత గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం గడ్డం వెంకటస్వామి చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజా సేవలో...

మహాలక్ష్మికి పెరుగుతున్న ఆదరణ..3 నెలల్లో 97.20 లక్షల అదనపు ప్రయాణాలు

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో టీజీఎస్‌ఆర్టీసీపై ప్రయాణికుల రద్దీ భారం కూడా గణనీయంగా పెరుగుతోంది. గతేడాదితో...