మృతుడి కుటుంబానికి అండగా అంజి మాస్టర్.. రూ.3 వేల ఆర్థిక సాయం

1001310168.jpg

వెల్దండ అక్టోబర్ 29 :వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన భూషరాజ్ శ్రీశైలం అనారోగ్యంతో మృతి చెందగా,విషయం తెలుసుకున్న అంజి మాస్టర్ వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.3,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబ సభ్యుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఇలాంటి కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం మన బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శారద బాలయ్య గౌడ్, వార్డు సభ్యులు ఉడుత బాలస్వామి, గోరటి అశోక్ కుమార్, భూషరాజు దశరథం, దువ్వాసి పెద్ద వెంకటయ్య, డీలర్ వెంకటయ్య, భూషరాజు వెంకటయ్య, సాయిబాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...