అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న 22ఏ అంశంతో పాటు పలు కీలక విషయాలపై ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్షించనున్నట్లు సమాచారం.

రెవెన్యూ సంబంధిత సమస్యలు, 22ఏ జాబితాలో ఉన్న భూముల అంశం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కూడా మంత్రులతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఆయా శాఖల పరిధిలోని అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి వివరాలు తెలుసుకుని, అవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పాలనకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.

You may also like...