Daily Archive: October 2, 2026

లింగారెడ్డి పల్లి లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

వెల్దండ మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారి అధ్యక్షతన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు.ఈ సభలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను వివరించారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటిని కాపాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు….

వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు

వెల్దండ: వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో వివిధ ఘటనలకు సంబంధించి మూడు కేసులు నమోదైనట్లు ఎస్సై యుగేందర్ రెడ్డి తెలిపారు.ఇంట్లో చోరీ: గాజులోని భావితండాకు చెందిన వద్యావత్ దేవేందర్ తన పొలం వద్ద పనిచేసేందుకు 15 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన హేమంత్‌ను పనిలో పెట్టుకున్నాడు.దేవేందర్ దంపతులు కల్వకుర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువా తెరిచి ఉండటాన్ని గుర్తించారు. అందులోని రూ.50 వేల నగదు, సుమారు ఐదు గ్రాముల బంగారు కమ్మలు కనిపించలేదు. హేమంత్ కూడా…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. లయన్ గుడిపాటి శివప్రసాద్, పద్మ దంపతుల దాతృత్వంతో శుక్రవారం కట్టంగూర్ లో వికలాంగులు, నిరుపేద పిల్లలు, వృద్ధులు కలిపి సుమారు 100 మందికి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని నిరుపేదలకు అండగా…

కిస్మత్‌పూర్ దర్గా విలేజ్‌లో వీధి దీపాల మరమ్మతులు చొరవ చూపిన బీఆర్‌ఎస్ నాయకులు.

ఈరోజు ఆయన జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులతో మాట్లాడి, సిబ్బందిని రప్పించి గ్రామంలోని పలు వీధుల్లో చెడిపోయిన వీధి దీపాలకు తక్షణమే మరమ్మతులు చేయించి, కొత్త లైట్లను వేయించారు.

మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసా.. విషాదంలో ఊతకర్రలా..ఉప్పల

మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసాకల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని బెక్కర గ్రామం దార ఎల్లమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతురాలు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వేంరెడ్డి శేఖర్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ దార వెంకటయ్య,గోరటి ఉషన్న, ప్రభాకర్…

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 1వ వార్డులో అభివృద్ధి పనులు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 1వ వార్డులో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి చొరవతో లహరి కృష్ణ ఆలయ కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం కమ్యూనిటీ షెడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభం కావడంపై 1వ వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

కల్వకుర్తి నియోజకవర్గం :మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం కర్మన్‌ఘాట్‌లో ఘనంగా నిర్వహించారు. భారాస కల్వకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి జైపాల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారాస సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారితో ఓటు…

మండల స్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల క్రీడా పోటీలు

మోమిన్ పేట్ మండల స్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల క్రీడా పోటీలు భవిత కేంద్రం వద్ద నిర్వచించడం జరిగింది ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని పాల్గొన్నారు ప్రత్యేక విద్యార్థుల కోసం చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. అవన్నీ కూడా ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. భవిత కేంద్రం కూడా అతి త్వరలో పూర్తి అయ్యేలా చూడాలని మండల విద్యాధికారి నర్సింలు గారికి చెప్పడం జరిగింది….

పేదల సొంతింటి కలను సహకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎలుమ ఫంక్షన్ హాల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సి కూచుకుల్ల దామోదర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ హేమంత కేశవ్ పాటిల్,మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర ,ఎమ్మార్వో తబితా రాణి గారు , ఆర్డీవో అర్చన,కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,లబ్ధిదారులు,తదితరులు హాజరయ్యారు.అలాగే జిల్లా డీసీసీ కార్యదర్శి కొత్త శ్రీనివాసులు,పొడుగు శ్రీనివాసులు పాల్గొన్నారు.13వ వార్డు మరియు 2వ వార్డుకు చెందిన…

ఎఫ్‌జీఎఫ్ గేమ్స్‌లో జనగామ టైక్వాండో విద్యార్థుల ప్రతిభ

మహబూబాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎఫ్‌జీఎఫ్ గేమ్స్‌లో జనగామ జిల్లా టైక్వాండో క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. అబ్బాస్ టైక్వాండో అండ్ బాక్సింగ్ అకాడమీకి చెందిన క్రీడాకారులు పోటీల్లో ప్రతిభను చాటారు.గోల్డ్ మెడల్స్: పంగ సుప్రియ, కందుల నందిని.సిల్వర్ మెడల్స్: గొల్ల ఉదయ్ చరణ్, బానోతు సంతోష్.బ్రాంజ్ మెడల్స్: మంగళంపల్లి లలనా శ్రీ, డప్పు హేమంత్.ఈ సందర్భంగా కోచ్ ఎం.డి. అబ్బాస్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో విద్యార్థులు శిక్షణ…