Daily Archive: October 8, 2026
కట్టంగూర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసనజ్ఞాన తెలంగాణ కట్టంగూర్, అక్టోబర్ 8: ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతియుత ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులను పోలీసులు అరెస్టు చేసి, లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కట్టంగూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు సుంకరబోయిన వెంకన్న మాట్లాడుతూ నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా…
స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 8 : ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూరు సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను గురువారం ఆర్ఐ రామారావు తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు…
పిల్లల అవసరాన్ని గుర్తించి.. స్పీకర్ బహూకరణనారగూడెం ప్రభుత్వ పాఠశాలకు సర్పంచ్ మల్లేశ్ చేయూతజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 8 : పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించే ప్రార్థన, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు సౌకర్యవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌత్ స్పీకర్‌ను గురువారం నారగూడెం సర్పంచ్ కురిమిల్ల మల్లేశ్ అందించారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్పీకర్ అవసరాన్ని గుర్తించిన ఆయన సొంతంగా స్పీకర్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు…
కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం గురువారం రోజు జనగామ మర్రి మాందాపూర్ చౌరస్తా వద్ద మాందాపూర్ మరియు జనగామ వెళ్లే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి దృష్టిలో ఉంచుకొని SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMAX లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జనగామ సర్పంచ్ మట్ట శ శ్రీనివాస్ మరియు మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి మాందాపూర్ సర్పంచ్ హరీష్ యాదవ్ సీతారాం పల్లి సర్పంచ్ సిద్ధ రాములు ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు జీవన్ రెడ్డి…
కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ముంద సతీష్ మూడో వార్డు సభ్యులు బతుకమ్మ మరియు దసరా పండగల సందర్భంగా గ్రామంలో మూడో వార్డులో ఆడపడుచులకు వాడు సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలవకూడదని గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్, ఉప సర్పంచ్ చింతకుంట సంతోష్ రెడ్డి సహకారంతో స్ట్రీట్ లైట్లు పెట్టిస్తున్నానని మూడవ వార్డు సభ్యులు బంద్ సతీష్ తెలియజేశారు.
ఆమనగల్:పట్టణానికి చెందిన ప్రముఖ స్క్రాప్ వ్యాపారవేత్త కరీం భాయ్ బామ్మర్దుల వివాహ రిసెప్షన్ వేడుకను షాద్‌నగర్‌లోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకుడు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు పాపిశెట్టి రామన్న ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి ‘షాదీ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి…
వెల్దండ:మండల పరిధిలోని గానుగట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని పుష్కబోడు తండాలో గిరిజనుల ఆరాధ్యదైవం ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి మాజీ సర్పంచ్ పత్యానాయక్ రూ.1.05 లక్షల విరాళం అందించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. విరాళం అందించిన పత్యానాయక్‌కు తండా ప్రజలు, ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
జ్ఞాన తెలంగాణ,జనగామ ప్రతినిధి,అక్టోబర్ 8:పోగొట్టుకున్న 67 మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన జనగామ పోలీసులు వాటిని సంబంధిత బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే బాధితులు ధైర్యం కోల్పోకుండా CEIR (Central Equipment...
జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ ప్రీతినిధి దిల్లీలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఇండీ కూటమికి చెందిన నేతలు రాజ్‌ఘాట్ వైపు తరలివెళ్తున్నారు. రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించి ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు....