Category: తెలంగాణ

పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్  సరఫరా నిలిపివేతరేపు అనగా మంగళవారం తేదీ 29.09.2026 నాడు సబ్ స్టేషన్ లో మరమత్తులు చేయడం కోసం  ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్  సరఫరా నిలిపి వేస్తున్నట్టు ఏఈ ప్రదీప్ కుమార్ తెలిపారు కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మనవి.విద్యుత్ సరఫరా నిలిపివేసేప్రాంతాలు:పర్వేద,మసానిగూడ ,సంకేపల్లి , అంతప్పగూడ ,ఏర్వగూడ, కొత్తగూడ ,మంచగార్లగూడ, కచ్చిరెడ్డిగూడ…

రాచూర్ బీటి రోడ్డు నిర్మాణానికి ప్రజావాణిలో ఫిర్యాదు

వెల్దండ సెప్టెంబర్ 28: వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీడీవో అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక్క ఫిర్యాదు అందినట్లు ఎంపీడీవో సులోచన తెలిపారు.మండల కేంద్రం నుండి రాచూర్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణాని కై పలుమార్లు అధికారులకు దరఖాస్తులు అందజేసి పాదయాత్రలు చేపట్టిన రోడ్డు పనులు చేపట్టకపోవడం బాధాకరమంటూ వినతిలో పేర్కొన్నట్టు వార్డు సభ్యులు సురేష్ రెడ్డి, కొంగళ్ళ స్వాతి శివశంకర్ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తీసుకోకుండా తిప్పి పంపుతున్నారని…

SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన

SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ
నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన

కల్వకుర్తి నియోజకవర్గంలో వైద్య విద్యార్థులకు ఉప్పల వెంకటేష్ ఆర్థిక భరోసా

కల్వకుర్తి: గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్య విద్యలో ప్రవేశం సాధించిన నిరుపేద విద్యార్థులకు కల్వకుర్తి నియోజకవర్గ విద్యా ప్రదాత, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్న ఆర్థిక భరోసా అందించారు.తలకొండపల్లి మండలం అంతరం గ్రామానికి చెందిన బొరిగే అరుణ్ కుమార్, కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని మల్లీశ్వరి నాయక్ MBBS లో సీట్లు సాధించారు. వారిద్దరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్…

చిరు వ్యాపారుల జీవనోపాధి కాపాడండి: బీజేపీ నేత తల్లోజు ఆచారి డిమాండ్

ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, తమను ఆదుకోవాలని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు వేడుకున్నారు.షాద్‌నగర్ రహదారిలో డబ్బాలను తొలగించడం ద్వారా వారి జీవనోపాధి కోల్పోయి ఇతర గ్రామాలకు వలస వెళ్లారని, వారికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి జీవనోపాధి కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న డబ్బాలను తొలగిస్తే తాము కూడా…

వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి

నాగర్ కర్నూల్: కల్వకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,వాకిటి శ్రీహరి,జూపల్లి కృష్ణారావుల సమక్షంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి తదితర ముఖ్యమైన అంశాలపై నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల…

ఆకట్టుకుంటున్న పురుషోత్తం రెడ్డి గ్రామీణ మహిళ వేషధారణ పెయింటింగ్

వెల్దండ,సెప్టెంబర్ 28: ఆంధ్రజ్యోతి రిపోర్టర్ యెన్నం పురుషోత్తం రెడ్డి తన కలంతోనే కాకుండా కుంచెతోనూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఆయన వేసిన ఈ ఆయిల్ పెయింటింగ్ లో గ్రామీణ మహిళ సాంప్రదాయ వేషధారణలో, నీలం రంగు చీర, పసుపు రంగు ఓణీతో ఎంతో సహజంగా కనిపిస్తుంది. ముఖంలో భావం, చేతులకు తెల్ల గాజులు,మెడలో ముత్యాల హారం చిత్రానికి మరింత అందాన్ని తెచ్చాయి.వృత్తిలో జర్నలిస్టుగా ఉంటూనే, ప్రవృత్తిగా చిత్ర లేఖనంలోనూ తనకున్న ఆసక్తిని ఇలా చిత్రాల రూపంలో ఆవిష్కరిస్తున్నారని…

మాదాపూర్ గ్రామంలో 14 రోజుల మట్టి స్టార్ గల్లి గణేష్ నిమర్జన వేడుకల ఉత్సవాల్లో….

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో మల్టీ స్టార్ గల్లి గణేష్ 14 రోజుల నిమజ్జన ఉత్సవాల్లో “0” విలువతో లడ్డును లక్కీ డ్రా తీయడం జరిగింది అందులో 37 యూతులకు ఒక లడ్డును లక్కీ డ్రా తీయగా ఆది హిందువు దళ్ అదృష్టం వరించింది. అదేవిధంగా ఇండివిజువల్ గా గ్రామం మొత్తానికి ఒక లడ్డును “0” విలువతో లక్కీ డ్రా తీయడం జరిగింది అయితే ఈ రెండింటిలో ఒకే వర్గానికి చెందిన ఆది హిందు…

మాతృభాషా పాఠశాలలో రేలారే ప్రసాద్ కు ఘన సన్మానం

మాతృభాషా పాఠశాలలో ‘రేలారే ప్రసాద్’కు ఘన సన్మానం ​మేడికొండ (న్యూస్‌లైన్): తనకు నాలుగు అక్షరాలు నేర్పించి, నాటి వేదికపై పాటతో ప్రస్థానాన్ని ప్రారంభించిన మాతృ పాఠశాలలోనే ప్రజా గాయకుడు ‘రేలారే ప్రసాద్’ (సుభాష్) కు ఘన సన్మానం జరిగింది. స్థానిక ZPHS మేడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ​వరల్డ్ వైడ్‌గా ప్రాచుర్యం పొందిన ‘సోమశిల’ పాటతో గ్రామానికి, పాఠశాలకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టిన ప్రసాద్‌ను ఉపాధ్యాయ బృందం పూర్వ…

కల్వకుర్తి ఏబీవీపీ నగర కమిటీ ఎన్నిక

కల్వకుర్తి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కల్వకుర్తి నగర కమిటీని జిల్లా కన్వీనర్ మొక్తల శాంతన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.నగర కార్యదర్శిగా వసంత చరణ్ యాదవ్, సంయుక్త కార్యదర్శులుగా వేముగంటి శివరాం, భరద్వాజ్ ఎన్నికయ్యారు. ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్‌గా ఎం.రామ్‌చరణ్, కో-కన్వీనర్‌గా శివచరణ్; ఎస్‌ఎఫ్‌ఎస్ కన్వీనర్‌గా శివ, కో-కన్వీనర్‌గా పవన్‌చారి; సోషల్ మీడియా కన్వీనర్‌గా శివ, కో-కన్వీనర్‌గా గౌతమ్ ఎంపికయ్యారు.అలాగే క్రీడా భారత్ కన్వీనర్‌గా రవీందర్, కళామంచ్ కన్వీనర్‌గా రాకేష్, కో-కన్వీనర్‌గా…