మాడుగులలో ఐక్యత ఫౌండేషన్ 26వ జాబ్‌ డ్రైవ్‌.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

మాడ్గుల అక్టోబర్ 27 :నిరుద్యోగ యువతీ,యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 26వ జాబ్‌ డ్రైవ్‌ బుధవారం మాడుగులలో జరగనుంది.ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరుకానున్నారు.మాడుగులలోని శ్రీ వాసవి ఫంక్షన్ హాల్‌లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. నిరుద్యోగ యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.1001305117.jpg

You may also like...