శంకర్‌పల్లిలో గంజాయి కలకలం..

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి ప్రాంతంలో గంజాయి వ్యవహారం కలకలం రేపింది. ఎస్‌ఓటీ పోలీసులు చేపట్టిన దాడిలో 170 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో శంకర్‌పల్లికి చెందిన వ్యక్తి ఒకరు, లింగంపల్లికి చెందిన మరొకరు వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. బీదర్‌కు చెందిన మరో వ్యక్తి పోలీసుల దాడి సమయంలో పరారైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు, పరారైన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ఏ చర్యలు చేపట్టారు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

You may also like...