చిరు వ్యాపారుల జీవనోపాధి కాపాడండి: బీజేపీ నేత తల్లోజు ఆచారి డిమాండ్
- కల్వకుర్తి నియోజకవర్గంలో వైద్య విద్యార్థులకు ఉప్పల వెంకటేష్ ఆర్థిక భరోసా - September 28, 2026
- చిరు వ్యాపారుల జీవనోపాధి కాపాడండి: బీజేపీ నేత తల్లోజు ఆచారి డిమాండ్ - September 28, 2026
- డిండి లిఫ్ట్ రద్దు చేయాలని డిమాండ్: UMPPS JAC మహా పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ : - September 28, 2026
ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, తమను ఆదుకోవాలని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు వేడుకున్నారు.
షాద్నగర్ రహదారిలో డబ్బాలను తొలగించడం ద్వారా వారి జీవనోపాధి కోల్పోయి ఇతర గ్రామాలకు వలస వెళ్లారని, వారికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి జీవనోపాధి కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న డబ్బాలను తొలగిస్తే తాము కూడా వలస వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ డబ్బాలు తొలగించడం జరిగిందని, అదేవిధంగా కరెంటు కూడా కట్ చేశారని వ్యాపారులు వాపోయారు. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని ఆచారి గారు డిమాండ్ చేశారు."నలభై ఏళ్లుగా ఇదే ఆధారం.. తొలగిస్తే మా బతుకులేంటి" అంటూ వ్యాపారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
