ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. ఎర్రపహాడ్ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం

తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి తాడ్వాయి ప్రాథమిక సహకార సంఘం (PACS) చైర్మన్ సంతాజి సుధాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. PJTAU, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రసారమైన వీడియోల ద్వారా ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులు, వర్షపాతం అంచనాలు, భూగర్భ జలమట్టాలు, నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితులపై వివరించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు, ఖేత్ బచావో అభియాన్, కస్టమ్ హైరింగ్ సెంటర్ల (CHCs) నిర్వహణ మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs), స్వయం సహాయక సంఘాలు (SHGs), ప్రాథమిక సహకార సంఘాల (PACS) ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, బల్క్ కొనుగోలుదారులు, అగ్రిగేటర్లతో అనుసంధానం, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలపై వివరించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులతో సంభాషణ, రైతుల అభిప్రాయ సేకరణ ద్వారా సాగులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, సహకార సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా రైతులు, యువ రైతులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...