రామన్నగూడలో రూ.43 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
- జనసేనతో పొత్తు.. బీజేపీకి రాజకీయ లాభమా? నష్టమా? - October 27, 2026
- రామన్నగూడలో రూ.43 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం - October 27, 2026
- విద్యుత్ మృత్యుపాశం.. మహిళా రైతు బలి! - October 27, 2026

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల: మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో అడుగు పడింది. చేవెళ్ల మున్సిపాలిటీలోని 10వ వార్డు రామన్నగూడలో రూ.43 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడంతో పాటు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ పనులను చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను చేపడుతూ మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు.రామన్నగూడ 10వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానికులకు రాకపోకల్లో సౌలభ్యం కలగనుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


