మాతృభాషా పాఠశాలలో రేలారే ప్రసాద్ కు ఘన సన్మానం
- అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు - September 28, 2026
- పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత - September 28, 2026
- మాతృభాషా పాఠశాలలో రేలారే ప్రసాద్ కు ఘన సన్మానం - September 28, 2026
మేడికొండ (న్యూస్‌లైన్):
తనకు నాలుగు అక్షరాలు నేర్పించి, నాటి వేదికపై పాటతో ప్రస్థానాన్ని ప్రారంభించిన మాతృ పాఠశాలలోనే ప్రజా గాయకుడు 'రేలారే ప్రసాద్' (సుభాష్) కు ఘన సన్మానం జరిగింది. స్థానిక ZPHS మేడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
వరల్డ్ వైడ్‌గా ప్రాచుర్యం పొందిన 'సోమశిల' పాటతో గ్రామానికి, పాఠశాలకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టిన ప్రసాద్‌ను ఉపాధ్యాయ బృందం పూర్వ విద్యార్థిగా ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్.ఎం తిమ్మారెడ్డి గారు మరియు ఉపాధ్యాయులు ఆయనను పొన్నాడ, శాలువాతో సత్కరించి అభినందించారు.
అనంతరం రేలారే ప్రసాద్ విద్యార్థులతో ముచ్చటిస్తూ — "ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నా ఊరికి, నన్ను తీర్చిదిద్దిన ఈ బడికి నేను ఎప్పుడూ విద్యార్థినే" అని భావోద్వేగానికి లోనయ్యారు. విద్యార్థులకు తన పాటలతో ఉత్సాహాన్ని నింపి, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హెచ్.ఎం తిమ్మారెడ్డి, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

