రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా బీబీపేట మడలం ఇస్సానగర్ గ్రామానికి చెందిన అల్లం మల్లయ్య గారు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ, వారి కుటుంబానికి S.R. ఫౌండేషన్ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారు అండగా నిలిచారు.
మల్లయ్య మరణ వార్తను గ్రామ సర్పంచ్ గారు సుభాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గ్రామ సర్పంచ్ ధర్మగారి రాజాగౌడ్, స్థానిక వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఈ ఆర్థిక సహాయాన్ని మల్లయ్య కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. కష్టసమయంలో ఉదారంగా స్పందించి సాయం అందించిన సుభాష్ రెడ్డి గారికి మరియు S.R. ఫౌండేషన్ నిర్వాహకులకు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు