పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

పర్వేద సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా మంగళవారం (సెప్టెంబర్ 29) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ప్రదీప్ కుమార్ తెలిపారు. పర్వేద, మసానిగూడ, సంకేపల్లి, అంతప్పగూడ, ఏర్వగూడ, కొత్తగూడ, మంచగార్లగూడ, కచ్చిరెడ్డిగూడ, చందిప్ప, రామంతాపూర్ గ్రామాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని, మరమ్మతు పనులు సకాలంలో పూర్తయ్యేందుకు విద్యుత్‌ శాఖకు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.

You may also like...