కల్వకుర్తి ఏబీవీపీ నగర కమిటీ ఎన్నిక
- తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు - September 28, 2026
- కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.! - September 28, 2026
- నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు - September 28, 2026
కల్వకుర్తి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కల్వకుర్తి నగర కమిటీని జిల్లా కన్వీనర్ మొక్తల శాంతన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.నగర కార్యదర్శిగా వసంత చరణ్ యాదవ్, సంయుక్త కార్యదర్శులుగా వేముగంటి శివరాం, భరద్వాజ్ ఎన్నికయ్యారు. ఎస్ఎఫ్డీ కన్వీనర్‌గా ఎం.రామ్‌చరణ్, కో-కన్వీనర్‌గా శివచరణ్; ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్‌గా శివ, కో-కన్వీనర్‌గా పవన్చారి; సోషల్ మీడియా కన్వీనర్‌గా శివ, కో-కన్వీనర్‌గా గౌతమ్ ఎంపికయ్యారు.అలాగే క్రీడా భారత్ కన్వీనర్‌గా రవీందర్, కళామంచ్ కన్వీనర్‌గా రాకేష్, కో-కన్వీనర్‌గా సంతోష్, గర్ల్స్ కన్వీనర్‌గా దీపిక, కో-కన్వీనర్‌గా సుష్మలను ఎన్నుకున్నారు.
