కల్వకుర్తి నియోజకవర్గంలో వైద్య విద్యార్థులకు ఉప్పల వెంకటేష్ ఆర్థిక భరోసా

కల్వకుర్తి: గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్య విద్యలో ప్రవేశం సాధించిన నిరుపేద విద్యార్థులకు కల్వకుర్తి నియోజకవర్గ విద్యా ప్రదాత, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్న ఆర్థిక భరోసా అందించారు.తలకొండపల్లి మండలం అంతరం గ్రామానికి చెందిన బొరిగే అరుణ్ కుమార్, కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని మల్లీశ్వరి నాయక్ MBBS లో సీట్లు సాధించారు. వారిద్దరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ఉప్పల వెంకటేష్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలనే లక్ష్యంతో తమ ట్రస్ట్ ద్వారా నిరంతరం సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ల సంఘం తలకొండపల్లి మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, హాజిలాపూర్ గ్రామ సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్, అంతరం మాజీ సర్పంచ్ రాములు, హర్యానాయక్ తండా సర్పంచ్ కొర్ర శిరీష కృష్ణ నాయక్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పాండు నాయక్, BRSV రాష్ట్ర నాయకులు దారమోని గణేష్, సిద్ధమోని నరేష్ గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.1001347826.jpg

You may also like...