Category: జిల్లా వార్తలు

కోటి దీపోత్సవ ఆహ్వాన పత్రిక

కోటి దీపోత్సవ ఆహ్వాన పత్రిక అందజేతకుత్బుల్లాపూర్, గాజులరామారం డివిజన్‌లో నిర్వహించనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి గారికి నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆహ్వానించారు. సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు భక్తిభావాన్ని, సామాజిక ఐక్యతను చాటిచెబుతాయని పేర్కొన్నారు.

మహా సదర్ సమ్మేళనంలో ముద్దం నర్సింహ

ఓల్డ్ బోయిన్‌పల్లి యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 9న నిర్వహించనున్న మహా సదర్ సమ్మేళనం కార్యక్రమానికి ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారిని సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సదర్ సమ్మేళనం ఆహ్వాన పత్రాన్ని అందజేసి, కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమం నవంబర్ 9, 2026 సోమవారం సాయంత్రం 6 గంటలకు ఓల్డ్ బోయిన్‌పల్లి ఎక్స్ రోడ్ లో నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో నందు యాదవ్, నర్సింహ యాదవ్,…

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఆమనగల్ పోలీసులకు ఫిర్యాదు

ఆమనగల్, నవంబర్ 06: డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై యూట్యూబ్‌లోని ఉపేందర్ పబ్లిక్ మీడియా ఛానల్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, నిరాధార ఆరోపణలు చేసినట్లు పేర్కొంటూ అమన్గల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సంబంధిత వ్యక్తులు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వివాదాస్పద వీడియోలను తొలగించాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులపై వ్యాఖ్యలు చేసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్…

పోయిన ఫోన్లకు భరోసా.. CEIRతో రికవరీ!

జ్ఞాన తెలంగాణ, సిద్దిపేట, నవంబర్ 6: పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను తిరిగి పొందడంలో సిద్దిపేట పోలీసులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ సహాయంతో గత నెల రోజుల్లో సుమారు రూ.10 లక్షల విలువైన 56 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి...

ప్రభుత్వ అధికారి ముసుగులో మోసాలు!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: ప్రభుత్వ అధికారిననే ముసుగులో ప్రజాప్రతినిధులు, సామాన్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫైనాన్స్‌ శాఖలో సీనియర్‌ అధికారిగా పరిచయం చేసుకుంటూ నకిలీ ప్రభుత్వ పథకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 53 ఏళ్ల...

డీప్‌ఫేక్‌తో రూ.5 కోట్ల దందా!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానాన్ని సృజనాత్మకతకు, అభివృద్ధికి వినియోగించాల్సిన కొందరు దుండగులు అదే సాంకేతికతను నేరాలకు అస్త్రంగా మలుచుకుంటున్నారు. డీప్‌ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్‌ ఫొటోలతో వ్యక్తుల ప్రతిష్ఠను బజారుకీడ్చి, కోట్ల రూపాయలు దండుకోవాలనే దురాశతో బ్లాక్‌మెయిల్‌ దందాకు తెరలేపారు. తాజాగా ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా...

ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత

ఎండ్రీయాల్ గ్రామానికి చెందిన ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్దేశంతో సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ నగదును గ్రామ పంచాయతీ కార్యదర్శి చేతుల మీదుగా పోస్టాఫీస్ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డిగారి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, పోస్టాఫీస్‌లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు కలిగిన ముగ్గురు బాలికల ఖాతాల్లో…

తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్వాయి గ్రామ శివారులో దెమి కలాన్ రోడ్డు పక్కన పత్తి చేను వద్ద డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ, పోలీస్ సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పులి రమేష్ (దేవాయిపల్లి), బట్టు నర్సింలు, ధర్మయోల్లా రాములు (తాడ్వాయి) అనే ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12,800 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు….

తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

తాడ్వాయి: VBG RAM G పథకంలో భాగంగా ప్రతి 40 మంది కూలీలకు ఒక మేటును నియమించాలనే ప్రభుత్వ నిబంధనల మేరకు తాడ్వాయి మండల కేంద్రంలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. MPDO భరత్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో మేట్లకు VBG RAM G పనులకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పనుల కొలతలు తీసుకునే విధానం, డిమాండ్ వర్క్స్…

ఇందిరమ్మ కమిటీ వివాదానికి తెరదించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్

లింగంపేట మండలం మోతె గ్రామపంచాయతీలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఇందిరమ్మ కమిటీ రద్దు వివాదంపై ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ విషయమై సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఎంపీడీవోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా, శుక్రవారం గ్రామాన్ని సందర్శించి పాలకవర్గ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. అందరూ సమన్వయంతో కలిసిమెలిసి పనిచేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. గ్రామంలో వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యే పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దన్నారు. అదనంగా ఇళ్లు అవసరమైతే…