కోటి దీపోత్సవ ఆహ్వాన పత్రిక

కుత్బుల్లాపూర్:
గాజులరామారం డివిజన్‌లో నిర్వహించనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి గారికి నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆహ్వానించారు. సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు భక్తిభావాన్ని, సామాజిక ఐక్యతను చాటిచెబుతాయని పేర్కొన్నారు.

You may also like...