తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
- తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - November 6, 2026
- తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - November 6, 2026
తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్వాయి గ్రామ శివారులో దెమి కలాన్ రోడ్డు పక్కన పత్తి చేను వద్ద డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ, పోలీస్ సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పులి రమేష్ (దేవాయిపల్లి), బట్టు నర్సింలు, ధర్మయోల్లా రాములు (తాడ్వాయి) అనే ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12,800 నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తాడ్వాయి పోలీసులు హెచ్చరించారు.
