ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత

ఎండ్రీయాల్ గ్రామానికి చెందిన ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్దేశంతో సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ నగదును గ్రామ పంచాయతీ కార్యదర్శి చేతుల మీదుగా పోస్టాఫీస్ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డిగారి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, పోస్టాఫీస్‌లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు కలిగిన ముగ్గురు బాలికల ఖాతాల్లో ఈ నగదును జమ చేయనున్నట్లు తెలిపారు. 2024 తర్వాత జన్మించిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఆధార్ కార్డులతో స్థానిక పోస్టాఫీస్‌ను సంప్రదించి తమ కుమార్తె పేరుతో ఖాతా ప్రారంభించుకోవాలని సూచించారు. ఆడపిల్లల విద్య, ఉన్నత భవిష్యత్తు, ఆర్థిక భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

You may also like...