ఇందిరమ్మ కమిటీ వివాదానికి తెరదించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
- తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - November 6, 2026
- తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - November 6, 2026
లింగంపేట మండలం మోతె గ్రామపంచాయతీలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఇందిరమ్మ కమిటీ రద్దు వివాదంపై ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ విషయమై సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఎంపీడీవోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా, శుక్రవారం గ్రామాన్ని సందర్శించి పాలకవర్గ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. అందరూ సమన్వయంతో కలిసిమెలిసి పనిచేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. గ్రామంలో వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యే పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దన్నారు. అదనంగా ఇళ్లు అవసరమైతే ఎమ్మెల్యే ద్వారా మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ నిధుల ఖర్చులపై వచ్చిన ప్రశ్నలకు గ్రామస్తుల సమక్షంలో సంబంధిత వివరాలు, బిల్లుల నంబర్లతో సహా వెల్లడించారు.
