Category: జిల్లా వార్తలు

సమాజ ఐక్యతకు ఆధ్యాత్మికతే పునాది: సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్

వెల్దండ, నవంబర్ 11: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఈదమ్మబండ తండాలో శ్రీ దుర్గామాత–సేవాలాల్ మహారాజ్ ఆలయాల భూమిపూజ కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గామాత–సేవాలాల్ మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దుర్గామాత, సేవాలాల్ మహారాజ్ బోధించిన సత్యం, శాంతి, ధర్మ మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి…

మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ కుటుంబానికి సంపత్ గౌడ్ పరామర్శ

లింగంపేట్: మండలంలోని పోతాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన (TRS) ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించి, లక్ష్మీనారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల అధ్యక్షుడు…

మోశంపూర్‌లో రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆగ్రహం

▪️ 15 రోజులైనా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు▪️ వారం రోజుల్లో కొనుగోళ్లు చేపట్టకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరికరామారెడ్డి మండలం మోశంపూర్‌ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పర్యటించి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కల్లంలో రైతులు వడ్లు పోసి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల నుంచి వడ్లు కొనుగోలు…

సంగోజివాడిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం

ఎల్లారెడ్డి: గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు సంగోజివాడి గ్రామానికి చెందిన చిన్న వాడికారి అనితకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ సందర్భంగా బుధవారం లబ్ధిదారురాలి నూతన ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ముగ్గు పోశారు. ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారురాలు అనిత సంతోషం వ్యక్తం చేస్తూ, తనకు ఇల్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు గంట బాలరాజు,…

సొంతింటి కల నెరవేర్చడమే రేవంత్ సర్కార్ లక్ష్యం:

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ బుధవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, స్థానికంగా నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వ…

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి

కుత్బుల్లాపూర్ పరిధిలోనిహెచ్‌ఎం‌టీ సంస్థ కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమానికి హెచ్‌ఎం‌టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరై ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దకాలంగా బకాయిల కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర…

ఎండ్రియాల్‌లో దుర్గాభవాని ఆలయ నిర్మాణానికి కరపూజ

ఎండ్రియాల్: గ్రామంలో దుర్గాభవాని మాత ఆలయ నిర్మాణం చేపట్టే సంకల్పంతో న్యూ ఇండియన్ యూత్ అసోసియేషన్ (దేవి శక్తిక్షేత్రం), ఎండ్రియాల్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి కరపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరావు, ప్రధాన కార్యదర్శి రెడ్డిగారి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో యూత్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, రామస్వామి, వెంకటరమణ, కృష్ణకర్ రావు, మనోహర్ రెడ్డి, కిషన్ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. దుర్గాదేవి అమ్మవారు శక్తి, ధైర్యం, ధర్మానికి ప్రతీకగా హిందూ సంప్రదాయంలో…

ఎండ్రియాల్‌లో చరిత్రకు ఘన నివాళి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి భూమిపూజ

తాడ్వాయి: బ్రిటిష్ పాలకుల అకృత్యాలను ఎదిరించి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపనకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా తమ గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం గర్వకారణమని గ్రామస్తులు తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846లోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడారు. వడ్డే…

లింగారెడ్డిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కు గౌరవ వేతనం అందజేత

లింగారెడ్డిపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరి గారికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గౌరవ వేతనం అందజేశారు.గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య మరియు వార్డు సభ్యుల ప్రోత్సాహంతో, గ్రామ పెద్దలు అమిరుల్లా ఖాన్ గారు రూ. 5000/- లను గౌరవ వేతనంగా అందించారు.విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ అంకితభావంతో పనిచేస్తున్న రాజేశ్వరి గారిని ఈ సందర్భంగా గ్రామ పాలకవర్గం అభినందించింది….

రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 11: గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడా ప్రతిభకు కొదవ లేదని నిరూపించాడు కట్టంగూర్ మండలం దుగినవెల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఏనుగుల గోపాలకృష్ణ. ఈ నెల 11న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా జూనియర్ కళాశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్‌-14 వాలీబాల్ ఎంపిక పోటీల్లో గోపాలకృష్ణ పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. దుగినవెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో…