సమాజ ఐక్యతకు ఆధ్యాత్మికతే పునాది: సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్

1001351434.jpg

వెల్దండ, నవంబర్ 11: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఈదమ్మబండ తండాలో శ్రీ దుర్గామాత–సేవాలాల్ మహారాజ్ ఆలయాల భూమిపూజ కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గామాత–సేవాలాల్ మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దుర్గామాత, సేవాలాల్ మహారాజ్ బోధించిన సత్యం, శాంతి, ధర్మ మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు ధన్సింగ్ నాయక్, రాజు నాయక్, జబ్బర్ నాయక్, వినోద్ నాయక్, రాజ్ కుమార్, సుమన్ నాయక్, సంతోష్ నాయక్, కుమార్ నాయక్ అతిథులను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చల్లా వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, శ్రీనివాస్ చారి, విజేందర్ రెడ్డి, చిలికేశ్వరం యాదయ్య, అల్లే నరేష్, సంతోష్ నాయక్, లక్ష్మణ్ నాయక్, పాండు నాయక్, అంజ్య నాయక్, మహిపాల్ నాయక్, శంకర్ నాయక్, శివలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...