లింగారెడ్డిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కు గౌరవ వేతనం అందజేత

లింగారెడ్డిపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరి గారికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గౌరవ వేతనం అందజేశారు.గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య మరియు వార్డు సభ్యుల ప్రోత్సాహంతో, గ్రామ పెద్దలు అమిరుల్లా ఖాన్ గారు రూ. 5000/- లను గౌరవ వేతనంగా అందించారు.విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ అంకితభావంతో పనిచేస్తున్న రాజేశ్వరి గారిని ఈ సందర్భంగా గ్రామ పాలకవర్గం అభినందించింది. ఆమెకు గౌరవ వేతనం అందించిన అమిరుల్లా ఖాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామి గారు, ఉపాధ్యాయులు పంతులాల్ గారు తదితరులు పాల్గొన్నారు1001408340.jpg

You may also like...