మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ కుటుంబానికి సంపత్ గౌడ్ పరామర్శ

లింగంపేట్: మండలంలోని పోతాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన (TRS) ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించి, లక్ష్మీనారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా యువజన అధ్యక్షుడు జైల్ సింగ్, మండల కార్యదర్శి మహేందర్, గ్రామ అధ్యక్షుడు సాయిలు, తలారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...