సంగోజివాడిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం

ఎల్లారెడ్డి: గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు సంగోజివాడి గ్రామానికి చెందిన చిన్న వాడికారి అనితకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ సందర్భంగా బుధవారం లబ్ధిదారురాలి నూతన ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ముగ్గు పోశారు. ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారురాలు అనిత సంతోషం వ్యక్తం చేస్తూ, తనకు ఇల్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు గంట బాలరాజు, మాజీ సర్పంచ్ తెనుగు గంగారం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గైని శివాజీ, మండల మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎండీ కరామత్, ఎండీ ఫారూక్, గంట రవి, శేఖర్, బాలకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

You may also like...