Category: జిల్లా వార్తలు

ఎరవెల్లి ప్రజల పాదయాత్రకు చీమర్ల అర్జున్ రెడ్డి సంపూర్ణ మద్దతు.!

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి కల్వకుర్తి,నవంబర్ 19: డిండి లిఫ్ట్ ప్రాజెక్టు కారణంగా ముంపు ముప్పు ఎదుర్కొంటున్న ఎరవెల్లి గ్రామం, ఎరవెల్లి తండా ప్రజలు తమ గ్రామాన్ని కాపాడుకోవాలనే డిమాండ్‌తో చేపడుతున్న పాదయాత్రకు యువ నాయకుడు చీమర్ల అర్జున్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎరవెల్లి గ్రామస్తులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా…

మల్టీపర్పస్ సిబ్బందికి జీవిత బీమా భరోసా : కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 19 : గ్రామపంచాయతీలో పని చేస్తున్న మల్టీపర్పస్ సిబ్బందికి జీవిత బీమా ఎంతో భరోసా ఇస్తుందని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. పంచాయతీరాజ్ ఆదేశాల గురువారం జీపీ నిధుల నుంచి ఒక్కొక్కరికి రూ.755 ప్రీమియం చెల్లించి 20 మంది సిబ్బందికి రూ.15లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా అట్టి బీమా పత్రాలను సిబ్బందికి అందజేసి మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణలో నిరంతరం…

హాస్టళ్లలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

మేడ్చల్: ప్రభుత్వ గురుకుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారం అందించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పురుగుల అన్నం, నాణ్యతలేని కూరగాయలు, కలుషిత నీటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో నిరంతర తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో రాజీపడరాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విజయరాజ్, ఉపాధ్యక్షుడు కొండా…

జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు.. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,నవంబర్ 19: నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయం,ఊర్కొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు, రిసెప్షన్, సైబర్ క్రైమ్ వారియర్, సీసీటీవీ విభాగాల పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.బాధితుల ఫిర్యాదులపై వేగంగా, పారదర్శకంగా స్పందించాలని, డయల్ 112 కాల్స్‌కు సకాలంలో సేవలు అందించాలని ఆదేశించారు. రౌడీషీటర్ల…

సైబరాబాద్ మూవ్స్–2026’ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్: నగర రవాణా వ్యవస్థను సురక్షితంగా, సమర్థవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, నిపుణులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 26 నుంచి 28 వరకు హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించనున్న మూడు రోజుల ‘సైబరాబాద్ మూవ్స్–2026’ సదస్సు పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సైబరాబాద్ సీపీ ఎం. రమేష్, మున్సిపల్ కమిషనర్ జి. సృజన తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి 74 కీలక జంక్షన్ల అభివృద్ధితో…

విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి: డా.చాగంటి

కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గురువారం ఉదయం డా.చాగంటి కోటేశ్వర్ రావు విద్యార్థులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. విద్యార్థులు ఆధ్యాత్మిక భావనతో పాటు సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకుంటూ, మానసికంగా శారీరకంగా దృఢపడాలని వివరించారు. అన్నింటి వరకు ఫోన్లకు దూరంగా ఉండాలని హితబోధ చేశారు. పుస్తక పఠనం ఎక్కువగా సూచించబడింది. పట్టణంలోని ప్రముఖులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

ఉప్పరపల్లి: వరి కొయ్యలను కాల్చవద్దు: ఏవో నరేంద్ర

కామారెడ్డి జిల్లా పంట కోతల తర్వాత వరి కొయ్యలను కాల్చవద్దని బీబీపేట మండల వ్యవసాయ అధికారి నరేంద్ర సూచించారు. గురువారం ఉప్పరపల్లిలో కాల్చిన వారి కొయ్యలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోతుందని చెప్పారు. ప్రతి రైతు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని, వరి పంటలు సాగు చేయాలని సూచించారు.

ఎన్‌హెచ్-765డీపై ప్రమాదం.. వృద్ధుడు మృతి

కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలం నడిమి తండా వద్ద ఎన్‌హెచ్-765డిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాట్రోత్ మేగ్యా (70) గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 17న రాత్రి రహదారి దాటుతుండగా బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న గూడ్స్ వాహనం ఢీకొట్టింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ స్వగ్రామంలో కన్నుమూశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణ జట్టుకు స్పోర్ట్స్ డ్రెస్‌లు స్పాన్సర్ చేసిన పరిగి ఎమ్మెల్యే డా రామ్మోహన్ రెడ్డి

ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నిర్వహించనున్న 45వ జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులకు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్పోర్ట్స్ డ్రెస్‌లు (ట్రాక్‌సూట్‌లు) స్పాన్సర్ చేశారు.ఈ సందర్భంగా క్రీడాకారులకు ట్రాక్‌సూట్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొప్పుల రఘుమోహన్ రెడ్డి,తెలంగాణ ఖోఖో అసోసియేషన్ సెక్రెటరీ కృష్ణమూర్తి,నల్గొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు…

సివిల్ సప్లై కమిషనర్‌ నాగిరెడ్డికి ఘన సన్మానం

సివిల్ సప్లై కమిషనర్‌ నాగిరెడ్డికి ఘన సన్మానం హైదరాబాద్,నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కమిషన్ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని సివిల్ సప్లై కార్యాలయంలో సివిల్ సప్లై కమిషనర్ వై. నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా అభినందనలు తెలిపారు.