మల్లం వెంకట్‌ను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి

పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన మల్లం వెంకట్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి వెంకట్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.