హాస్టళ్లలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

  • మేడ్చల్: ప్రభుత్వ గురుకుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారం అందించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పురుగుల అన్నం, నాణ్యతలేని కూరగాయలు, కలుషిత నీటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో నిరంతర తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో రాజీపడరాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విజయరాజ్, ఉపాధ్యక్షుడు కొండా అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం అనితారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు మింద్రాల నరసింహారావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...