మల్టీపర్పస్ సిబ్బందికి జీవిత బీమా భరోసా : కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్
- మల్టీపర్పస్ సిబ్బందికి జీవిత బీమా భరోసా : కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ - November 19, 2026
- నడవలేని స్థితిలోనూ పింఛన్ కోసం ఎదురుచూపులు ఐదేళ్లుగా మంచానికే పరిమితం.. నాలుగుసార్లు సదరం క్యాంపునకు వెళ్లినా ఫలితం శూన్యం - November 18, 2026
- సంక్షేమ పథకాల పంపిణీలో రాజకీయం చేయడం తగదు : కట్టంగూర్ ఉప సర్పంచ్ గుండు రాంబాబు - November 18, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 19 : గ్రామపంచాయతీలో పని చేస్తున్న మల్టీపర్పస్ సిబ్బందికి జీవిత బీమా ఎంతో భరోసా ఇస్తుందని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. పంచాయతీరాజ్ ఆదేశాల గురువారం జీపీ నిధుల నుంచి ఒక్కొక్కరికి రూ.755 ప్రీమియం చెల్లించి 20 మంది సిబ్బందికి రూ.15లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా అట్టి బీమా పత్రాలను సిబ్బందికి అందజేసి మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణలో నిరంతరం శ్రమించే సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. బీమా సౌకర్యం వారి కుటుంబాలకు ఆర్ధిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో జీవిత బీమా చేయించినట్లు తెలిపారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతి ఇస్తునట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏనుగు సైదులు, ఏకుల సుజాతసైదులు, శ్రీరాం సంధ్య వీరేశం, పులకరం శ్రీను కళ్లెం నాగేశ్వర్ రావు, గ్రామపంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
