Category: జిల్లా వార్తలు

ప్రజాసేవలో పడకల్ సర్పంచ్ ముందడుగు.. మండల పరిషత్‌కు రూ.25 వేల ప్రింటర్ అందజేత

ప్రజాసేవలో పడకల్ సర్పంచ్ ముందడుగు.. మండల పరిషత్‌కు రూ.25 వేల ప్రింటర్ అందజేత

తలకొండపల్లి,నవంబర్ 19:తలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయానికి పడకల్ గ్రామ సర్పంచ్ డోకూరి సునీతా ప్రభాకర్ రెడ్డి తన సొంత ఖర్చుతో సుమారు రూ.25 వేల విలువైన ప్రింటర్‌ను బహూకరించారు. బుధవారం ఎంపీడీవో సీతారామమ్మకు ప్రింటర్‌ను అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సీతారామమ్మ మాట్లాడుతూ.. మండల పరిషత్ కార్యాలయంలో రోజువారీ పరిపాలనా పనులు, దరఖాస్తులు, రికార్డుల నిర్వహణకు ప్రింటర్ ఎంతో అవసరమని, సర్పంచ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సొంత ఖర్చుతో అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రింటర్ కార్యాలయ పనులతో పాటు…

వెల్దండలో అభివృద్ధి పనులకు శ్రీకారం..సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

వెల్దండ:మండల కేంద్రంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం 1వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఎన్నం భూపతి రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల…

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కల్వకుర్తి నాయకుల భేటీ.!

కల్వకుర్తి, నవంబర్ 19(తెలంగాణ గర్జన): మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాడుగుల, వెల్దండ మండలాల బీసీ, ఎస్సీ సంఘాల నాయకులు, పలువురు సర్పంచులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు.ఈ సమావేశంలో సింగం నాగేష్ గౌడ్, పాలకూర రాజు గౌడ్, సిద్ధగొని రమేష్ గౌడ్, డొంకి శ్రీను, నాగిళ్ల మహేష్, చింతపల్లి బాలరాజ్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

గ్రామ సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యం -సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్

వెల్దండ, నవంబర్ 19: మండల కేంద్రంలోని 1వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ యెన్నం భూపతి రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, సీసీ రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ…

వేముల లక్ష్మమ్మకు రూ.40 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత.!

వెల్దండ, నవంబర్ 19 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన వేముల లక్ష్మమ్మ (భర్త వేముల లక్ష్మయ్యగౌడ్)కు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.40 వేల చెక్కును బుధవారం ఉదయం గ్రామంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ, వార్డు సభ్యులు తిరుపతి నాయక్, కేశమల్ల మమత అనిల్, మాడుగుల వెంకటయ్య, గంగాపురం శ్రీశైలం, ధన్ మంత్రి, జంగయ్యగౌడ్, ఎస్. సుధాకర్,…

లబ్ధిదారులకు పెన్షన్ సర్టిఫికెట్స్ అందజేసిన కోఆప్షన్ అక్బర్ హుస్సేన్

పరిగి పట్టణంలోని ఐదవ వార్డ్ లో పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా వారి వద్దకు వెళ్లి పెన్షన్ సర్టిఫికెట్స్ అందజేసిన కోఆప్షన్ అక్బర్ హుస్సేన్,మరి కొందరికి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లేష్ చేతులమీదగా అందజేశారు,ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు సర్వర్,నాగేందర్ ఉన్నారు.

26 నుంచి చీరలు, పింఛన్ల పంపిణీ!

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు, చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కొత్త తేదీ ఖరారైంది. ముందుగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్‌ 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది....

26న పింఛన్ల జాతర!

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో చేయూత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. నవంబర్‌ 26న మొత్తం 4,63,857 మందికి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా 4.50 లక్షల కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసింది. గతంలో మంజూరైన 1,23,625...