సైబరాబాద్ మూవ్స్–2026’ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్: నగర రవాణా వ్యవస్థను సురక్షితంగా, సమర్థవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, నిపుణులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 26 నుంచి 28 వరకు హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించనున్న మూడు రోజుల ‘సైబరాబాద్ మూవ్స్–2026’ సదస్సు పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సైబరాబాద్ సీపీ ఎం. రమేష్, మున్సిపల్ కమిషనర్ జి. సృజన తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి 74 కీలక జంక్షన్ల అభివృద్ధితో పాటు 400 విద్యాసంస్థల్లో 3.5 లక్షల మంది విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

You may also like...