Category: జిల్లా వార్తలు

38 వ వార్డు లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన షబ్బీర్ ఆలీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కామారెడ్డి పట్టణంలోని 38వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక…

ముదిరాజ్‌ల ఐక్యతకు పిలుపు.. మహాసభ వార్షికోత్సవ గోడపత్రిక విడుదల

వెల్దండ,నవంబర్ 20:తెలంగాణ ముదిరాజ్ మహాసభ 12వ వార్షికోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 21న నిర్వహించనున్న వేడుకల గోడపత్రికను శుక్రవారం వెల్దండలో విడుదల చేశారు.వెల్దండ ముదిరాజ్ సంఘం వద్ద జిల్లా మత్స్యకార సొసైటీ డైరెక్టర్ క్యాసరపు వెంకటయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బాదేపల్లి మల్లయ్య ముదిరాజ్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 21న జరిగే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని, ముదిరాజ్‌లంతా ఐక్యంగా పాల్గొని…

ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు.. నిరుపేద ఆడపడుచు పెళ్లికి రూ.10 వేల కానుక!

తలకొండపల్లి, నవంబర్ 20: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపడుచు వివాహానికి రూ.10 వేల ఆర్థిక కానుక అందజేశారు.గ్రామపంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రెండో పథకం ఆడపడుచు పెళ్లి కానుకలో భాగంగా గురువారం రాంపూర్ గ్రామానికి చెందిన అల్వాల ఈశ్వరమ్మ యాదయ్య గౌడ్ దంపతుల కుమార్తె అనూష వివాహం సందర్భంగా సర్పంచ్ రూ.10 వేల నగదును అందజేసి నూతన వధువును ఆశీర్వదించారు.ఎన్నికల్లో…

నార్సింగిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

నార్సింగి లో అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు & జరిమానాలు.

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇకపై సరైన ఇన్సూరెన్స్ పత్రాలు లేకుండా టోల్ ప్లాజాలు దాటితే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 15 నుండి అమల్లోకి రానున్నాయి.

హైదరాబాద్‌లో మెడికల్ షాపులపై TG SAFE మెరుపు దాడులు

మత్తును కలిగించే (హాబిట్-ఫార్మింగ్) మందుల అక్రమ విక్రయాలు, యాంటీబయాటిక్స్ విచ్చలవిడి అమ్మకాలను అరికట్టేందుకు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది.

టీఆర్ఎస్ పార్టీలో నూతన నియామకాలు.. గ్రామ, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి సంపత్ గౌడ్ చర్యలు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పలు నూతన నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామ అధ్యక్షుడిగా ఆర్. బాబు, లింగంపేట్ మండలం లింగంపల్లి కూర్దు గ్రామానికి చెందిన కుమ్మరి రాజేందర్‌ను మండల జాయింట్ సెక్రటరీగా, ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మర్రి బాలయ్యను ఎల్లారెడ్డి మండల రైతు కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమించారు.ఈ…

వరంగల్ దంపతుల ఆత్మహత్యపై డీజీపీ సీవీ ఆనంద్ దిగ్భ్రాంతి

వరంగల్ : చిన్న మొత్తంలో తీసుకున్న అప్పు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన వరంగల్ జిల్లా రంగశాయిపేటలో చోటుచేసుకుంది. వారానికి కేవలం రూ.750 అప్పు చెల్లించలేక దంపతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హృదయవిదారక ఘటనపై తెలంగాణ డీజీపీ సీవీ...

సుష్మిత మృతిపై న్యాయపోరాటం:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మహబూబాబాద్ ప్రతినిధి: ఆడబిడ్డ ప్రాణం పోయిన తర్వాత పరామర్శలతో సరిపెడతారా? కులం పేరుతో అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు ఉన్న యువతి అనుమానాస్పద మృతిపై న్యాయం ఎప్పుడు జరుగుతుంది? బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్...

వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్.!

వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్.!

తెలకపల్లి,నవంబర్ 19: తెలకపల్లి మండల పరిధిలో వ్యవసాయ బోర్లకు సంబంధించిన విద్యుత్ కేబుల్ వైర్లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం. రమేష్ తెలిపారు.ఎస్సై వివరాల ప్రకారం.. తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన పులిజాల క్రాంతి కుమార్ (23), బారిగారి ధన్‌రాజ్ అలియాస్ దామోదర్ (25), కొనిగారి చందు (25) సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యవసాయ బోర్లకు సంబంధించిన కేబుల్ వైర్లను…