జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు.. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
- వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్.! - November 19, 2026
- ఎరవెల్లి ప్రజల పాదయాత్రకు చీమర్ల అర్జున్ రెడ్డి సంపూర్ణ మద్దతు.! - November 19, 2026
- జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు.. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి - November 19, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,నవంబర్ 19: నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయం,ఊర్కొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు, రిసెప్షన్, సైబర్ క్రైమ్ వారియర్, సీసీటీవీ విభాగాల పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.బాధితుల ఫిర్యాదులపై వేగంగా, పారదర్శకంగా స్పందించాలని, డయల్ 112 కాల్స్‌కు సకాలంలో సేవలు అందించాలని ఆదేశించారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గ్రామస్థాయిలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ల వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.ఈ తనిఖీల్లో కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి, సీఐ భీమ్ కుమార్, ఊర్కొండ ఎస్ఐ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
