తెలంగాణ జట్టుకు స్పోర్ట్స్ డ్రెస్‌లు స్పాన్సర్ చేసిన పరిగి ఎమ్మెల్యే డా రామ్మోహన్ రెడ్డి
- తెలంగాణ జట్టుకు స్పోర్ట్స్ డ్రెస్‌లు స్పాన్సర్ చేసిన పరిగి ఎమ్మెల్యే డా రామ్మోహన్ రెడ్డి - November 19, 2026
- లబ్ధిదారులకు పెన్షన్ సర్టిఫికెట్స్ అందజేసిన కోఆప్షన్ అక్బర్ హుస్సేన్ - November 19, 2026
- యాసీన్ ప్రైమ్ హాస్పిటల్‌ను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే TRR - November 19, 2026
ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నిర్వహించనున్న 45వ జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులకు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్పోర్ట్స్ డ్రెస్‌లు (ట్రాక్సూట్లు) స్పాన్సర్ చేశారు.ఈ సందర్భంగా క్రీడాకారులకు ట్రాక్సూట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొప్పుల రఘుమోహన్ రెడ్డి,తెలంగాణ ఖోఖో అసోసియేషన్ సెక్రెటరీ కృష్ణమూర్తి,నల్గొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా ఖోఖో అసోసియేషన్ ఉపాఅధ్యక్షుడు డి. మాణిక్యం, పెద్దపల్లి జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కుమార్,ఆల్ ఇండియా ఖోఖో కోచ్ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన క్రీడా దుస్తులను అందించిన ఎమ్మెల్యే గారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
