Author: mandamula vinod kumar

జనసేన పార్టీ ఆఫీస్‌లో వైభవంగా అలయ్ బలయ్

ఈరోజు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో 'అలయ్ బలయ్' కార్యక్రమం అత్యంత వైభవంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు,దసరా సంస్కృతి, తెలుగువారి ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.ఈ వేడుకల్లో చేవెళ్ల నియోజకవర్గం నుండి శ్రీనివాస్,మహేందర్,సురేష్ రాథోడ్,హరీష్ రెడ్డి పాల్గొన్నారు పార్టీని చేవెళ్ల నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయడానికి, ప్రజల పక్షాన నిలబడటానికి అందరం ఐక్యంగా పనిచేస్తాం" అని పేర్కొన్నారు.

శంకరపల్లిలో దంచి కొడుతున్న వర్షం -స్థానికులకు ఉపశమనం,

శంకరపల్లి మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఒక్కసారిగా ఆకాశం మబ్బుపట్టి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది.వర్షం కారణంగా శంకరపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షంతో గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న శంకరపల్లి ప్రజలకు, వాహనదారులకు వాతావరణం చల్లబడి గొప్ప ఉపశమనం లభించింది.

శంకరపల్లిలో నీటి సంరక్షణపై కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల భారీ ర్యాలీ

నీటిని పొదుపు చేద్దాం – భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువునిద్దాం" అనే నినాదంతో శంకరపల్లి పట్టణంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి నీటి సంరక్షణపై గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.పాఠశాల ఆవరణ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారులు, మరియు ముఖ్య కూడళ్ల మీదుగా సాగింది. ర్యాలీలో విద్యార్థులు "నీటి బొట్టు పవిత్రం – దాన్ని వృథా చేయకండి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు…

MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మాదిగ మృతి పట్ల పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తీవ్ర దిగ్భ్రాంతి

-కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు -చేవెళ్ల ప్రాంతంలో ఉద్యమానికి తీరని లోటని ఆవేదనఎమ్మార్పీఎస్ (MRPS) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, నిబద్ధత కలిగిన ఉద్యమకారుడు బ్యాతల శివశంకర్ మాదిగ ఆకస్మిక మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెపోటుతో ఇటీవల మరణించిన శివశంకర్ మాదిగ నివాసానికి గురువారం ఆయన స్వయంగా వెళ్లారు. రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలంలోని టంగటూరు గ్రామంలోని శివశంకర్ మాదిగ నివాసానికి…

అక్రమాలపై అధికారుల పక్షపాత వైఖరి.. మెకిలలో వ్యక్తమవుతున్న నిరసనలు!

మెకిలా రెవెన్యూ పరిధిలో అధికారుల తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లవణి పట్టా భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హడావుడిగా తొలగిస్తున్న సిబ్బంది, నాళా భూములను ఆక్రమించి చేపట్టిన పెద్దల నిర్మాణాల జోలికి మాత్రం వెళ్లడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.  సామాన్యుల విషయంలో తక్షణమే చర్యలు తీసుకునే యంత్రాంగం, బడాబాబుల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. వీరికి ఉన్నతాధికారుల నుంచి అండదండలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు.. పేదలకు…