శంకరపల్లిలో నీటి సంరక్షణపై కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల భారీ ర్యాలీ
- శంకరపల్లిలో నీటి సంరక్షణపై కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల భారీ ర్యాలీ - October 28, 2026
- MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మాదిగ మృతి పట్ల పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తీవ్ర దిగ్భ్రాంతి - October 19, 2026
- అక్రమాలపై అధికారుల పక్షపాత వైఖరి.. మెకిలలో వ్యక్తమవుతున్న నిరసనలు! - October 15, 2026
నీటిని పొదుపు చేద్దాం – భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువునిద్దాం" అనే నినాదంతో శంకరపల్లి పట్టణంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి నీటి సంరక్షణపై గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.పాఠశాల ఆవరణ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారులు, మరియు ముఖ్య కూడళ్ల మీదుగా సాగింది. ర్యాలీలో విద్యార్థులు "నీటి బొట్టు పవిత్రం – దాన్ని వృథా చేయకండి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని స్థానిక ప్రజలకు, వ్యాపారులకు నీటి ప్రాముఖ్యతపై మరియు నీటిని వృథా చేయకూడదనే విషయంపై అవగాహన కల్పించారు.
