టీబీ రహిత గ్రామంగా జూపల్లికి జిల్లా స్థాయి అవార్డు

1001262917.jpg

చారకొండ:జూపల్లి గ్రామం టీబీ (క్షయవ్యాధి) రహిత గ్రామంగా జిల్లా స్థాయిలో అవార్డు అందుకున్న సందర్భంగా సత్య హరిచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లె దవాఖానలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో క్షయవ్యాధి నివారణకు కృషి చేసిన మండల వైద్యాధికారి డాక్టర్ సృజన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ) బలరాంతో పాటు ఆశా కార్యకర్తలు వలియో బేగం, సన బేగం, రజియా బేగం, భాగ్యమ్మ, దేవులీలను శాలువాలతో సన్మానించారు.అలాగే, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పల్లె దవాఖానకు వీల్‌చైర్‌ను ఫౌండేషన్ తరఫున బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష జగపతి, జూపల్లి గ్రామ సర్పంచ్ అమీనా అశోక్, సత్య హరిచంద్ర ఫౌండేషన్ చైర్మన్ ఎన్. రాములు యాదవ్, మండల డీఎస్పీ నాయకుడు పరశురాంతో పాటు పలువురు పాల్గొన్నారు.

You may also like...