శరన్నవరాత్రి ఉత్సవాలకు సుంకిరెడ్డి రూ.80 వేల విరాళం
- శరన్నవరాత్రి ఉత్సవాలకు సుంకిరెడ్డి రూ.80 వేల విరాళం - October 21, 2026
- యమపాశమైన ఈవీ చార్జర్.. యువకుడు బలి - October 21, 2026
- ఆలయాల నిర్మాణానికి గోలి బుచ్చిరెడ్డి కుటుంబం రూ.1.11 లక్షల విరాళం - October 21, 2026

తలకొండపల్లి:మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.అనంతరం ఉత్సవాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల కోసం తనవంతు సహకారంగా రూ.80 వేల విరాళాన్ని అందించారు. పండుగలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందించడంతోపాటు యువతలో కళల పట్ల ఆసక్తిని ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ సభ్యులు రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ గౌరవ అధ్యక్షుడు పుట్ట పాండు, గౌరవ ఉపాధ్యక్షుడు ఈటమోని మల్లేష్, అధ్యక్షుడు పుల్లారెడ్డి యాదయ్య, ఉపాధ్యక్షుడు పోచారం గిరిందర్ రెడ్డి, సభ్యులు ఉప్పనమోని మల్లేష్, ఈసరి శ్రీకాంత్, కందుకూరి కృష్ణ, కటికల శ్రీశైలం, కటికల మధు, దుర్గపురం పాండు, ఐక్యత ఫౌండేషన్ సభ్యుడు పోతుగంటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
