కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదారణ

కల్వకుర్తి సెప్టెంబర్ 06: కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందని,కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ లోని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నివాసంలో కడ్తాల్ మండలంలోని ముద్విన్, గడ్డమీది తాండా గ్రామ పంచాయతీలకు చెందిన పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాధారణ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు అయిల శ్రీనివాస్ గౌడ్ తో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, కల్వకుర్తి పట్టణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...