అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు ఉప్పల వెంకటేష్ సిమెంట్ అందజేత
- మతిస్థిమితం లేని వృద్ధుడి ఆచూకీ కోసం విజ్ఞప్తి - September 22, 2026
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా బాధ్యత కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత - September 22, 2026
- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి అభినందనలు - September 22, 2026

కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని గుండూరు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్‌ను అందజేశారు. రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నాగిళ్ల వెంకటయ్య, పోతరపల్లి పరమేష్, పోతరపల్లి గెలువమ్మ, పోతరపల్లి సైదులు కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్‌ను అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఉప్పల వెంకటేష్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, బీఆర్‌ఎస్ నాయకులు నాగయ్య, కృష్ణయ్య, సత్యనారాయణ, పరశురాములు, బీరప్ప, గోపాల్, చెన్నయ్య, శ్రీను, బాల్‌రామ్ తదితరులు పాల్గొన్నారు.
