Category: కామారెడ్డి

ఎఫ్‌పీఓల్లో చేరితే రైతులకు అధిక లాభాలు

తాడ్వాయి: రైతులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ (FPO)ల్లో చేరడం ద్వారా ఆర్థికంగా బలపడటంతో పాటు పంటలకు మెరుగైన ధరలు పొందవచ్చని అధికారులు సూచించారు. తాడ్వాయి సొసైటీ చైర్మన్ సంతాజి గారి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఎండ్రియాల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు ఎఫ్‌పీఓల ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఫ్‌పీఓ డొమైన్ ఎక్స్‌పర్ట్ మల్యాల శివాని మాట్లాడుతూ, రైతులు సంఘాలుగా ఏర్పడి పంటలను సమిష్టిగా మార్కెటింగ్ చేయడం ద్వారా…

పీర్మాయ కుంట తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం

తాడ్వాయి: నందివాడ పల్లెగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పీర్మాయ కుంట తండాలో మెగావత్ జాగుర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు ఆదేశాల మేరకు ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు లబ్ధిదారుడు, తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ జాదావు రేణుక గణపతి, పార్టీ అధ్యక్షుడు బానోత్ శ్రీను పండరి, నందివాడ సర్పంచ్ సంకు పోచయ్య, గ్రామ…

అప్పుల భారం.. ఎండిన వరి పంట.. రైతు ఆత్మహత్య

తాడ్వాయి: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి రమేశ్ (38) తన పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. అప్పుల భారం, ఎండల తీవ్రతకు నీరు అందక వరి పంట ఎండిపోవడం, పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న తాడ్వాయి ఎస్సై నరేశ్, ఏఎస్సై కొండల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

కామారెడ్డి బస్టాండ్‌లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం

కామారెడ్డి, అక్టోబర్ 23: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శుక్రవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాటలు, పాటల ద్వారా ప్రయాణికులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని, ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్…

హన్మాజీపేట్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామానికి చెందిన చాకలి గుమ్మడి కాశీరాం (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పాత చెరువు తూము వద్ద అతడి మృతదేహాన్ని రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామ సర్పంచ్ ఆశగోని లావణ్య వెంకట్ గౌడ్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. కాశీరాం మృతికి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఆరుతడి పంటలే మేలు!

ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున యాసంగిలో రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని బాన్సువాడ ఆర్డీఓ అడ్లా రవీందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్‌, మంజీరా జలాలు, చెరువుల నీటిపై ఆధారపడే రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలన్నారు.జొన్న, శనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో అనధికారికంగా మోటార్లు ఏర్పాటు చేసి…

జల్లపల్లిలో ఐకేపీ భవనం ప్రారంభం

 బాన్సువాడ:పోతంగల్ మండలం జల్లపల్లి ఆబాది గ్రామంలో నూతనంగా నిర్మించిన ఐకేపీ మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ నాలుగో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థిక అభివృద్ధికి ఐకేపీ భవనం ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సుల్తానా గౌస్, సర్పంచ్ బర్మావత్ వివేక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు…

పోచారం ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.3 కోట్ల నిధులు మంజూరు…

కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్ట్ అభివృద్ధి నమూనాలపై ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు వివరించిన ఆర్కిటెక్చర్ నిపుణులు, కన్సల్టెంట్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు.. త్వరలో పనులు ప్రారంభం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌ను ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ప్రత్యేక కృషితో రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించారు. ఈ అభివృద్ధి…

పేదలకు నాణ్యమైన ఇందిరమ్మ ఇళ్లను అందించడమే నా లక్ష్యం.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్మోహన్ రావు నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీపడేది లేదని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వెల్లడించారు.

హన్మాజీపేట్‌లో కొమురం భీమ్ జయంతి

బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో కొమురం భీమ్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకి గణేష్ మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆదివాసీల ఐక్యత, అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్…