Category: కామారెడ్డి

బాన్సువాడకు తెలంగాణ పబ్లిక్ స్కూల్

బాన్సువాడలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) భవన నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు పర్యటించగా, పోచారం స్వయంగా స్థలాన్ని చూపించారు.టెన్ ప్లస్ టూ విద్యా విధానంలో భాగంగా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కాలేజీని అనుసంధానం చేస్తూ నూతన భవన నిర్మాణానికి మంజూరు లభించింది.ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్…

వైవీ ప్రసాద్ కుటుంబానికి ఏనుగు రవీందర్‌రెడ్డి పరామర్శ

సీనియర్ జర్నలిస్ట్ వైవీ ప్రసాద్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిజం రంగానికి ప్రసాద్ మృతి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాసాని శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి గణేష్, కొత్తకొండ భాస్కర్, కిషోర్ యాదవ్, నందు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

అహింస, ప్రేమ, మానవత్వానికి అశోక విజయదశమి ప్రతీక

కామారెడ్డి: అహింస, శాంతి, ప్రేమ, మానవత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన చక్రవర్తి అశోకుడి ఆశయాలను కొనసాగించాలని అంబేద్కర్, బహుజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం, బాంసేఫ్, బహుజన, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 2570వ అశోక విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు....

తాడ్వాయి TRS మండల కమిటీలో ఇద్దరికి కీలక బాధ్యతలు

తాడ్వాయి: విజయదశమి పండుగ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ తాడ్వాయి మండల పార్టీ కమిటీలో ఇద్దరిని ఏకగ్రీవంగా నియమించారు. తాడ్వాయి మండల ప్రధాన కార్యదర్శిగా ఎండ్రియాల్...

తాడ్వాయి మండలంలో ఘనంగా దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్రలు

తాడ్వాయి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో దుర్గాదేవి నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారికి భక్తులు వైభవంగా శోభాయాత్ర నిర్వహించి వీడ్కోలు పలికారు. మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో తాడ్వాయి పీఏసీఎస్ చైర్మన్...

విజయదశమి వేళ.. మతసామరస్యానికి ప్రతీకగా పోచారం కుటుంబ సంప్రదాయాలు!

బాన్సువాడ: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన బాన్సువాడ గ్రామీణ మండలం పోచారంలో కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా కొనసాగుతున్న కుటుంబ సంప్రదాయాలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో దసరా...

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మోరీల్ శ్రీనివాసరావు, అంజిరెడ్డి

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 21:బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారిని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త మోరీల్ శ్రీనివాసరావు, జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ...

బాన్సువాడలో వైభవంగా రావణదహనం..

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 21:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో మంగళవారం రావణదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను వీక్షించారు.ఉమ్మడి జిల్లాల మాజీ...

హత్నూరలో వేడెక్కిన రాజకీయాలు: జైభీమ్ వర్సెస్ జైశ్రీరామ్ నినాదాలతో ఉద్రిక్తత

జ్ఞానతెలంగాణ, నర్సాపూర్ ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలో దసరా పండుగ వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రావణ దహనం కార్యక్రమం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జైభీమ్ మరియు జైశ్రీరామ్ నినాదాలతో హత్నూర ప్రాంతం మార్మోగిపోయింది.వివరాల్లోకి వెళ్తే,...

మొగులాన్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

మొగులాన్‌పల్లి శివారు అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరంపై బాన్సువాడ పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.18,630 నగదు, 8 సెల్‌ఫోన్లు, 4 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.