జల్లపల్లిలో ఐకేపీ భవనం ప్రారంభం
- జల్లపల్లిలో ఐకేపీ భవనం ప్రారంభం - October 23, 2026
- హన్మాజీపేట్లో కొమురం భీమ్ జయంతి - October 22, 2026
- బాన్సువాడకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ - October 22, 2026
బాన్సువాడ:పోతంగల్ మండలం జల్లపల్లి ఆబాది గ్రామంలో నూతనంగా నిర్మించిన ఐకేపీ మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ నాలుగో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థిక అభివృద్ధికి ఐకేపీ భవనం ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సుల్తానా గౌస్, సర్పంచ్ బర్మావత్ వివేక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి. శంకర్, మాజీ ఎంపీపీ పవన్, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
