Category: కామారెడ్డి

రాజకీయాలకు అతీతంగా ప్రజా అవసరాలకే ప్రాధాన్యత..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆపదలో ఉన్నవారికి అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్ జకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు తన సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ కార్యకర్త పోచయ్య* గారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశారు. పార్టీలకు అతీతంగా ప్రజల కష్టాలను అర్థం…

హామీల కోసం ఉద్యమకారుల పోరు.. బాన్సువాడలో అరెస్ట్‌లు

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న బాన్సువాడ ప్రాంత ఉద్యమకారులను సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 6 గంటలకే తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 250 గజాల స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్‌, గుర్తింపు కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. అరెస్టులతో…

సింగిల్ విండో డైరెక్టర్ కు సన్మానం…

కామారెడ్డి జిల్లా బీబీపెట్ PACS డైరెక్టర్ గా నియామకమైన ఇస్సానగర్ గ్రామానికి చెందిన కొమ్మిడి పుష్పలత నర్సారెడ్డి గార్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎస్ ఫ్రెండ్స్ సిండికేట్ సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, ఎంబరి స్వామి, మాజీ సర్పంచ్ పొట్టయ్య , మాజీ ఎంపీటిసి శివరాజ్, అంజిరెడ్డి తదితరులు తెలపారు.

ఎల్లారెడ్డిలో ఇద్దరు మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు.. భూమి పూజ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని 7వ వార్డులో జన్ముల సుజాత, కొర్న పోచమ్మలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో బాగంగా 10వ సారి రక్తదానం చేసిన లేగ్గేల రాజుకు ప్రత్యేక అభినందనలు..

కామారెడ్డి జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల (సంస్మరణ వారోత్సవాల) సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సమాచార హక్కు చట్టం (RTI) రాష్ట్ర కార్యదర్శి లేగ్గేల రాజు 10వ సారి రక్తదానం చేశారు.పదిసార్లు రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్న లేగ్గేల రాజును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గారు తమ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి సి.ఐ నరహరి గారు లేగ్గేల రాజుకు ప్రశంసా…

వజ్జేపల్లిలో విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు

సదాశివనగర్ మండలం వజ్జేపల్లి పాఠశాలలో IDA కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, దంతాల సంరక్షణపై వైద్యులు సూచనలు అందించారు.ఈ సందర్భంగా DMHO డా. వెంకట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరగా, IDA ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అలాగే NEHS ఎంప్యానెల్డ్ దంత ఆసుపత్రుల్లో హెల్త్ కార్డుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు దంత వైద్య…

కామారెడ్డి జిల్లా చరిత్రలో తొలిసారిగా 435 యూనిట్ల రక్తసేకరణ

తలసేమియా చిన్నారుల ప్రాణరక్షణకు పోలీసు శాఖ బృహత్‌ కార్యక్రమంకామారెడ్డి: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 435 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జిల్లాలోనే తొలిసారిగా నమోదైందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహం అధ్యక్షుడు ఎండీ జమీల్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు తలసేమియా సికిల్ సెల్ పురస్కారాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు….

ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేల విరాళం

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణం కోసం తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ రూ.50,000 (యాభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా యువజన అధ్యక్షుడు దేగావత్ జైల్ సింగ్, జిల్లా కాయితీలాభాన్ అధ్యక్షుడు నానక్ సింగ్, పాండు, ఐలాపూర్ ఉపాధ్యక్షుడు సాయిలు, చెన్నం ఉషయ్య, చెన్నం స్వామి, నరేష్, రవి,…

బీర్కూర్ సొసైటీ చైర్మన్‌గా గొండ్ల శ్రీనివాస్

బీర్కూర్ సహకార సంఘం చైర్మన్‌గా బరంగేడ్గి గ్రామానికి చెందిన గొండ్ల శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ పదవి కోసం అంబలి బసవరాజ్, గొండ్ల శ్రీనివాస్ పోటీపడగా, చివరకు శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. త్వరలో సొసైటీ పాలకమండలి డైరెక్టర్లను ఎంపిక చేయనున్నారు.

రెండు సూపర్ ఓవర్ల ఉత్కంఠ.. పోలీసులపై ప్రెస్ టీమ్ థ్రిల్లింగ్ విక్టరీ!

బాన్సువాడ ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో తొలి నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఏజాజ్, కాసుల రోహిత్, కౌన్సిలర్ ఎం.ఏ. హకీం కేక్ కట్ చేసి టోర్నీని ప్రారంభించారు.ప్రారంభ మ్యాచ్‌లో ప్రెస్, పోలీస్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. తొలుత పోలీస్ జట్టు 7 ఓవర్లలో 70 పరుగులు చేయగా, ప్రెస్ జట్టు కూడా 70 పరుగులు చేసి మ్యాచ్‌ను టై చేసింది. రెండు సూపర్ ఓవర్ల…