హన్మాజీపేట్‌లో కొమురం భీమ్ జయంతి

బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో కొమురం భీమ్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకి గణేష్ మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆదివాసీల ఐక్యత, అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశగోని లావణ్య వెంకగౌడ్, వార్డు సభ్యులు కొంకి సాయిలు, పోచయ్య, వడ్ల భాగయ్య, సంఘ సభ్యులు పెంకటి గణేష్, సంజీవులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

You may also like...