హన్మాజీపేట్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యం
- హన్మాజీపేట్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యం - October 24, 2026
- ఎల్నినో ఎఫెక్ట్.. ఆరుతడి పంటలే మేలు! - October 23, 2026
- జల్లపల్లిలో ఐకేపీ భవనం ప్రారంభం - October 23, 2026
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామానికి చెందిన చాకలి గుమ్మడి కాశీరాం (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పాత చెరువు తూము వద్ద అతడి మృతదేహాన్ని రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామ సర్పంచ్ ఆశగోని లావణ్య వెంకట్ గౌడ్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. కాశీరాం మృతికి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికతో మరణానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో గ్రామంలో విషాదం నెలకొంది.
